కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై 2023లో నమోదైన టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసును తెలంగాణ హైకోర్టు పూర్తిగా రద్దు చేసింది. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ “చేయని తప్పుకు అర్ధరాత్రి అరెస్టు చేసి జైలుకు పంపారు. కార్యకర్తల ఒత్తిడికి తట్టుకోలేక కక్ష సాధింపుగానే కేసు పెట్టారు. ఈ తీర్పు ఆ కక్షలకు అద్దంపట్టింది. కేసీఆర్ ప్రభుత్వం మెడ వంచిన పార్టీ బీజేపీ అనే తృప్తి ఉంది. ఈ పాపం ఊరికే పోదు” అని హెచ్చరించారు.

