మావోయిస్టు నాయకులు దేవజీ, మల్లా రాజిరెడ్డిని కోర్టు ముందు హాజరుపరచాలంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు “ఈ ఇద్దరూ మా అదుపులో లేరు. అరెస్టు చేసిన వారిని నియమాల ప్రకారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాం” అని నివేదిక సమర్పించారు. కానీ పిటిషనర్ తరఫు న్యాయవాది “పోలీసులు ముందు ప్రెస్‌కు ఎంకౌంటర్ జరిగిందని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ ప్రెస్ స్టేట్‌మెంట్‌ను కోర్టు ముందు ఉంచుతాం” అని వాదించారు. దీనిపై హైకోర్టు, “మావోయిస్టు నేతలు పోలీసు అదుపులోనే ఉన్నారని నిరూపించే ఆధారాలు సమర్పించండి” అని పిటిషనర్లకు ఆదేశించింది. కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

