తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం నేడు విచారణ చేపడతుంది. బీఆర్‌ఎస్ స్పీకర్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని జులై 31న ఆదేశించినప్పటికీ ఆలస్యమవుతోందని బీఆర్‌ఎస్ వాదిస్తోంది. స్పీకర్ మరింత గడువు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది. కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.

