విశాఖపట్నంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ, భోగాపురం విమానాశ్రయాన్ని కలుపే మాస్టర్‌ప్లాన్ రోడ్లను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీఎంఆర్‌డీఏ పరిధిలోని 8 ఎంఐజీ ప్రాజెక్టులు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, మౌలిక సదుపాయాలను త్వరితగతిన ముగించాలని సూచించారు. కైలాసగిరి పైభాగంలో 50 అంతస్తుల ఐకానిక్ భవనం, కొత్తవలసలో 120 ఎకరాల్లో థీమ్ ఆధారిత నగరం నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. జూన్ చివరి నాటికి టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ మాస్టర్‌ప్లాన్ డిజైన్‌ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

