జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా కొనసాగుతోంది. 101 పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ ముందంజ వేసింది. తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందులోనూ కాంగ్రెస్ బలపడింది. మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. 62 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో నిలిచారు. మొదటి రౌండ్‌లో కాంగ్రెస్‌కు 8,926 ఓట్లు రాగా బీఆర్‌ఎస్‌కు 8,864 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్‌లో కాంగ్రెస్ 9,691 ఓట్లు సాధించి 1144 ఓట్ల ఆధిక్యం పొందింది. అదే రౌండ్‌లో బీఆర్‌ఎస్‌కు 8,609 ఓట్లు లభించాయి. ఇంకా ఎనిమిది రౌండ్లు మిగిలి ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి విజయం సాధిస్తారని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. బీఆర్‌ఎస్ కూడా తమ అభ్యర్థి గెలుస్తారని ప్రకటిస్తోంది. బీజేపీ మాత్రం వెనుకబడి కొనసాగుతోంది.

