Wednesday, November 19, 2025

ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు ఆందోళ‌న‌

Must Read

ఢిల్లీ వాయు కాలుష్యం పెరుగుదలకు పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాలు తగలబెట్టడం ప్రధాన కారణమని సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం ఈ మేరకు నిర్దేశించింది. కోర్టు సహాయకురాలు సీనియర్ న్యాయవాది అపరాజితా సింగ్ పలు అంశాలు ప్రస్తావించారు. పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాల దహనం వల్ల ఢిల్లీ గాలి నాణ్యత దిగజారిందని, నాసా ఉపగ్రహ చిత్రాలు దీన్ని నిరూపించాయని తెలిపారు. గతంలో కోర్టు ఆదేశాలను రాష్ట్రాలు అమలు చేయలేదని ఆమె విమర్శించారు. పంట వ్యర్థాల దహన నియంత్రణకు తీసుకున్న చర్యలు ఏమిటో స్పష్టం చేయాలని జస్టిస్ గవాయ్ ఆదేశించారు. కాలుష్య నియంత్రణతోపాటు నిర్మాణ కార్యకలాపాలపై కూడా ఆదేశాలు జారీ చేస్తామని సీజేఐ పేర్కొన్నారు. కేసు తదుపరి విచారణ నవంబర్ 17న జరుగనుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -