ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబంపై గతంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆ వ్యాఖ్యలు బాధ కలిగించాలనే ఉద్దేశంతో చేయలేదని, ఇబ్బంది పెట్టడం లేదా పరువు దెబ్బతీయడం ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. పొరపాటు జరిగి ఉంటే చింతిస్తున్నానని, వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.

