నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు సమీపంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై విహారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో బస్సును వెంటనే పక్కకు ఆపి ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరిచాడు. బస్సులోని 29 మంది ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటపడ్డారు. ప్రమాదానికి 10 నిమిషాల ముందు టీ బ్రేక్ తీసుకున్నారు. బస్సు మళ్లీ బయలుదేరిన కొద్దిసేపటికే పొగలు రావడంతో డ్రైవర్ స్పందించాడు. ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. బస్సు పూర్తిగా కాలిపోయింది కానీ ఎవరికీ గాయాలు కాలేదు. పోలీసులు ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు.

