ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో తార్లగూడెం ప్రాంతంలోని మరికెళ్ల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులతో తలపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మద్దేడు ప్రాంత కమిటీకి సంబంధించిన మావోయిస్టులు అక్కడ ఉన్నారనే సమాచారం మేరకు పోలీసులు అన్నారం-మరికెళ్ల అడవుల్లో శోధన చేపట్టారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య తీవ్రమైన కాల్పులు జరుగుతున్నాయి. ముందురోజు బుధవారం ఇదే ప్రాంతంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.

