వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం ధర్మతండాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ విఫలమైన నేపథ్యంలో మహేష్ (21) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ప్రేమించిన యువతికి వేరొకరితో వివాహ సంబంధం చూస్తున్నారని తెలిసి, మహేష్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ ఘటనకు ముందు మహేష్ పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు, ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స సమయంలో మహేష్ మృతి చెందాడు. మహేష్ మరణంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ధర్మతండా గ్రామంలో విషాద ఛాయలు అలుముకుంది.

