ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. మూడు రోజుల పాటు దుబాయ్‌లో 25 కీలక సమావేశాల్లో పాల్గొన్న ఆయన, ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, వనరులు, ప్రభుత్వ సౌకర్యాలను వివరించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ ఇన్వెస్టర్స్ మీట్‌కు ఆహ్వానించారు. గల్ఫ్ దేశాల నుంచి తెలుగు ప్రవాసులతో జరిగిన డయాస్పోరా సమావేశంలో, ఎన్నికల్లో కూటమికి మద్దతిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్లతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

