తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ 25న ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏఐసీసీ అగ్రనాయకులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర పరిపాలన, కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు, జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల నియామకంపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారు. జిల్లా, పట్టణ కమిటీల అధ్యక్షుల ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకులు ఇప్పటికే జిల్లా పర్యటనలు పూర్తి చేశారు.

