Monday, October 20, 2025

బెంగళూరు రోడ్లు, చెత్తపై కిరణ్ మజుందార్ షా ఆవేదన

Must Read

బెంగళూరు నగరంలోని రహదారుల దుస్థితి మరియు చెత్త సమస్యలపై బయోకాన్ కంపెనీ ఎండీ కిరణ్ మజుందార్ షా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తన కంపెనీకి వచ్చిన ఓ విదేశీ పారిశ్రామికవేత్త బెంగళూరు రోడ్లు ఎందుకు అస్తవ్యస్తంగా ఉన్నాయి, చుట్టూ చెత్త ఎందుకు అని ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేకపోయానని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేసిన ఆమె, కర్ణాటక ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మరియు ఐటీ మంత్రిని ట్యాగ్ చేశారు. విదేశీ వ్యాపారవేత్త చైనా నుంచి వచ్చినట్లు తెలిపిన కిరణ్ మజుందార్ షా, భారత్‌లో విదేశీ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ, కలిసి పనిచేయడానికి ఆసక్తి లేకపోవడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు స్పందిస్తూ, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్.. విమర్శల కంటే సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేయడం ముఖ్యమని అన్నారు. రోడ్ల మరమ్మత్తు, గుంతలు పూడ్చడానికి రూ.1,000 కోట్లు కేటాయించామని, పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా స్పందిస్తూ, విదేశీ వ్యక్తి ఏ రోడ్లపై వచ్చారో తెలియదని, పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ సంఘటనతో బెంగళూరు రోడ్ల దురవస్థపై మరోసారి దేశవ్యాప్త చర్చ మొదలైంది.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -