Wednesday, October 14, 2026

మునుగోడులో మద్యం దుకాణాలకు కోమ‌టిరెడ్డి నిబంధనలు!

Must Read

తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ నడుస్తున్న వేళ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించినట్లు ఆయన తెలిపారు. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు గ్రామాల బయట మాత్రమే షాపులు పెట్టాలని, సిట్టింగ్ సౌకర్యాలు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. అలాగే, బెల్ట్ షాపులకు మద్యం విక్రయించరాదని కఠినంగా ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదని, యువత మద్యానికి బానిసలు కాకుండా కాపాడాలనే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కోమటిరెడ్డి వెల్లడించారు. ఈ సూచనలకు అనుగుణంగా, పార్టీ నాయకులు నల్గొండ ఎక్సైజ్ అధికారికి వినతిపత్రం సమర్పించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -