Thursday, March 12, 2026

‘కల్కి-2’ నుంచి దీపికా ఔట్, అలియా భట్ ఎంట్రీ?

Must Read

వైజయంతీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కనున్న ‘కల్కి-2’ చిత్రం నుంచి బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె తప్పుకున్నట్లు అధికారికంగా ప్రకటించడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. ‘కల్కి 2898 ఏడీ’లో సుమతి పాత్రలో అద్భుత నటనతో మెప్పించిన దీపికా, సీక్వెల్‌లో ఉండబోరని తెలియడంతో ఆమె అభిమానులు షాక్‌కు గురయ్యారు. అంతేకాదు, ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందనున్న ‘స్పిరిట్’ చిత్రం నుంచి కూడా దీపికా తప్పుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం వెనుక కారణాలపై సినీ వర్గాల్లో ఊహాగానాలు తెగుతున్నాయి.
ఇదిలా ఉంటే, ‘కల్కి-2’లో దీపికా స్థానంలో బాలీవుడ్ స్టార్ అలియా భట్ నటించే అవకాశం ఉందని ముంబయి సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. చిత్ర బృందంతో అలియా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్ని వివరాలు ఖరారైన తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ చిత్రానికి ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై హాలీవుడ్ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. అలియా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆమె కెరీర్‌లో ఇది మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ‘కల్కి-2’పై క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -