Monday, January 26, 2026

బిగ్‌బీ బ‌ర్త్ డే.. డార్లింగ్ స్పెష‌ల్ విషెస్‌!

Must Read

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11న‌ తన 83వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో బిగ్ బీకి హృదయపూర్వక విషెస్ తెలిపారు. “మీతో కలిసి పనిచేయడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం నా జీవితంలో గొప్ప గౌరవం. మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి” అని ప్రభాస్ తన పోస్టులో పేర్కొన్నారు. గత ఏడాది విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, ప్రభాస్ భైరవగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ ‘కల్కి 2’ తెరకెక్కుతోంది, దీనిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణెను వైజంతి మూవీస్ తొలగించినట్లు సమాచారం. దీంతో ఆమె పాత్రను బాలీవుడ్ నటి అలియా భట్ పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అభిమానులు ‘కల్కి 2’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, మరింత సమాచారం కోసం వేచి చూడాల్సిందే.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -