Thursday, July 16, 2026

పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్!

Must Read

గోదావరి నదిపై పాపికొండల మధ్య ఆకర్షణీయమైన బోట్ విహారయాత్ర మరోసారి పర్యాటకులను ఆకట్టుకోనుంది. వర్షాకాలంలో గోదావరిలో వరదల కారణంగా మూడు నెలలుగా నిలిచిపోయిన ఈ యాత్రలు ఇప్పుడు తిరిగి ప్రారంభమవుతున్నాయి. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో, ఇరిగేషన్ అధికారులు పాపికొండల విహారయాత్రకు అనుమతులు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కాపర్ డ్యామ్‌లో నీటి మట్టం తగ్గడంతో ఈ రోజు నుంచి బోట్ యాత్రలు పునఃప్రారంభం కానున్నాయి. దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి పాపికొండలకు బయలుదేరే ఈ విహారయాత్ర కోసం 15 బోట్లు సిద్ధంగా ఉన్నాయి. అదనంగా, ఒక కొత్త బోటుకు అధికారులు అనుమతి ఇవ్వాల్సి ఉంది. మొదటి పది రోజుల పాటు అధిక సామర్థ్యం గల బోట్లను ఉపయోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. పర్యాటకుల భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పాపికొండల మధ్య గోదావరి నదిలో బోట్ యాత్రలు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడమే కాకుండా, బోట్లలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. వీకెండ్ సెలవులను ఆహ్లాదకరంగా గడపాలనుకునే పర్యాటకులు ఈ యాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్వాహకులు బోట్లను సిద్ధం చేస్తూ, పర్యాటకులకు సురక్షితమైన, ఆనందకరమైన అనుభవాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -