Wednesday, October 22, 2025

ఎస్సైపై అట్రాసిటీ కేసు నమోదు

Must Read

వరంగల్ నగరంలో పోలీసులపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్సై శ్రీకాంత్, కానిస్టేబుల్ రాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాల ప్రకారం, ఈ నెల 22న అర్ధరాత్రి మిల్స్ కాలనీ ప్రాంతంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్న దళిత మహిళ మరియమ్మపై దాడి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు కొత్త అదనపు ఎస్పీ శుభం పర్యవేక్షణలో కొనసాగుతోంది. అయితే, మరోవైపు ఎస్సై శ్రీకాంత్ ఫిర్యాదు ఆధారంగా మరియమ్మ, ఆమె కుమారుడు శేఖర్‌పై కూడా కేసు నమోదు కావడంతో ఈ సంఘటనపై వివాదం మరింత ముదిరింది. స్థానికంగా ప్రజలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -