Saturday, August 30, 2025

జడ్పీటీసీ ఎన్నికలకు రీపోలింగ్ డిమాండ్

Must Read

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు రీపోలింగ్ నిర్వహించాలని, ఎన్నికల్లో విస్తృతంగా దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. అలాగే, కేంద్ర బలగాల ఆధ్వర్యంలోనే తిరిగి ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతల ఆరోపణల ప్రకారం, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేయడంలో పోలీసులు సహకరించారని తెలిపారు. పోలీసుల అండతోనే వారు ఓటు వేయడం, ఓటర్లను బెదిరించడం జరుగుతోందని విమర్శించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని బయటకు రానివ్వకుండా డీఐజీ కోయ ప్రవీణ్ పహారా కాస్తున్నారని ఆరోపించారు.ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా స్పందించారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలను బలవంతంగా కైవసం చేసుకోవడంలో సీఎం చంద్రబాబు దురాగతాలకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాష్ట్రాన్ని రౌడీల పాలన వైపు నడిపిస్తున్నారని, ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అధికారులను, పోలీసులను తన ఆధీనంలోకి తీసుకుని ఎన్నికలను హైజాక్ చేశారని, ఇవాళ రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డే అని పేర్కొన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -