Saturday, August 30, 2025

దిగొచ్చిన‌ బంగారం, వెండి ధరలు

Must Read

ప‌సిడి ప్రియుల‌కు కొంత ఉపశమనం లభించింది. గత వారం ట్రంప్ సుంకాల ప్రభావంతో పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరి, శ్రావణమాసపు కొనుగోళ్లపై గట్టి భారమయ్యాయి. అయితే ఈ వారం మాత్రం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వాణిజ్యవర్గాల సమాచారం ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.760 తగ్గి రూ.1,02,280 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.700 తగ్గి రూ.93,750కు చేరింది. 18 క్యారెట్ల బంగారం కూడా తులానికి రూ.570 తగ్గి రూ.76,710 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలూ కొనుగోలుదారులకు కొంత ఊరటను ఇచ్చాయి. కిలో వెండి ధర రూ.1,17,000 వద్ద ట్రేడ్ అవుతుండగా, చెన్నైలో మాత్రం కిలో ధర రూ.1,27,000గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో కిలో వెండి రూ.1,17,000 వద్ద కొనసాగుతోంది. నిపుణుల అంచనాల ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు మరియు డాలర్ విలువ మార్పులపై ఆధారపడి రాబోయే రోజుల్లో ధరల్లో మరిన్ని హెచ్చుతగ్గులు సంభవించే అవకాశం ఉంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -