Friday, March 13, 2026

పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం

Must Read

మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదుపుతప్పిన ప్రయాణికుల వ్యాన్‌ లోయలో పడిపోవడంతో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 27 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. శ్రావణ మాసం పవిత్ర సోమవారం సందర్భంగా ఖేడ్‌ తహసీల్‌లోని శ్రీ క్షేత్ర మహాదేవ్‌ కుందేశ్వర్‌ ఆలయానికి భక్తులు వెళ్తున్నారు. ఈ క్రమంలో దాదాపు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్‌ అదుపు తప్పి లోయలో పడిపోయింది. సంఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన వారిని స్థానికులు, పోలీసుల సహాయంతో ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -