Saturday, August 30, 2025

లైంగిక సమ్మతికి 18 ఏళ్లు నిండాల్సిందే

Must Read

దేశంలో లైంగిక చర్యకు సమ్మతి తెలిపే కనీస వయసు 18 ఏళ్లుగానే కొనసాగాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరిమితిని 16 ఏళ్లకు తగ్గించాలన్న వాదనపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ వయోపరిమితి తగ్గింపుపై చేసిన వాదనకు ప్రతిస్పందిస్తూ, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్యా భాటి కోర్టుకు లిఖితపూర్వకంగా సమాధానం సమర్పించారు. మైనారిటీలను లైంగిక దోపిడీ, మోసాల నుంచి రక్షించడమే ఈ చట్టంలోని ప్రధాన ఉద్దేశమని ఆమె వివరించారు. యువతీ–యువకుల మధ్య ప్రేమ సంబంధాల పేరుతో వయోపరిమితి తగ్గిస్తే, దాన్ని నేరస్తులు దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువని ప్రభుత్వం హెచ్చరించింది. పిల్లల మౌనం, అమాయకత్వాన్ని ప్రయోజనంగా చేసుకుని లైంగిక దాడులకు పాల్పడే వారిపై కఠిన నియంత్రణ కల్పించడంలో 18 ఏళ్ల పరిమితి కీలకమని పేర్కొంది. అలాగే, ఈ పరిమితిని తగ్గిస్తే బాలల అక్రమ రవాణా, చిన్నారులపై నేరాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ప్రస్తుత నిబంధనలో ఎలాంటి మార్పు అవసరం లేదని స్పష్టం చేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -