Saturday, August 30, 2025

ఎర్రకోటలో భద్రతా లోపం

Must Read

దేశ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలకు కొద్ది రోజుల ముందే ఎర్రకోట భద్రతలో పెద్ద ఎత్తున లోపం బయటపడింది. ఢిల్లీ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక భద్రతా డ్రిల్‌లో విధుల్లో ఉన్న అధికారులు డమ్మీ బాంబును గుర్తించలేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.స్వాతంత్య్ర‌ వేడుకల్లో ప్రధాని ప్రసంగించే వేదిక కావడంతో ఎర్రకోటలో భద్రతా చర్యలు అత్యంత కట్టుదిట్టంగా ఉండాలి. ఈ క్రమంలో ప్రత్యేక తనిఖీలు, డ్రిల్లులు నిర్వహిస్తుంటారు. తాజాగా జరిగిన డ్రిల్‌లో సాధారణ పౌరుల్లా వేషం వేసుకున్న భద్రతా సిబ్బంది డమ్మీ బాంబుతో లోపలికి ప్రవేశించారు. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది ఆ బాంబును గుర్తించలేకపోవడంతో ఉన్నతాధికారులు వెంటనే వారిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై భద్రతను మరింత బలోపేతం చేసి, ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరో ఘటనలో ఎర్రకోటలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా బంగ్లాదేశ్‌కు చెందినవారని, వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉన్నారని గుర్తించారు. విచారణలో వీరు అక్రమ వలసదారులని తేలిందని అధికారులు తెలిపారు. వీరి ఉద్దేశ్యం ఏమిటి, ఎలా లోపలికి చొరబడ్డారనే అంశాలపై దర్యాప్తు జరుగుతోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -