Saturday, August 30, 2025

జ‌ర్న‌లిజంలో కొత్త పోక‌డ‌లు ప్ర‌మాద‌క‌రం – సీఎం రేవంత్ రెడ్డి

Must Read

స్వతంత్ర సంగ్రామ కాలంలో దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపి అందరినీ ఒక వేదికపైకి తేవడంలో పత్రికలు అపారమైన కృషి చేశాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు కొన్ని వింత పోకడలు పాత్రికేయ రంగానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఓ దినపత్రిక వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. “కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని పత్రికలు ప్రజల పక్షాన నిలబడి చైతన్యం చేయడంలో విశేష కృషి చేశాయ‌ని పేర్కొన్నారు. అందరికీ ఆదర్శంగా నిలబడ్డాయ‌ని, ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంతో పాటు బాల్య వివాహాలు, కులాల మధ్య అంతరాలు, జోగినీ వ్యవస్థ.. వంటి సమాజంలోని అనేక రుగ్మతలపై ప్రజలను చైతన్యం చేశాయ‌ని చెప్పారు. చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించడంలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో నడిచే పత్రికల పాత్ర మరువలేనిద‌న్నారు. ఇప్పుడు పాత్రికేయ రంగంలో కొన్ని వింత పోకడలు వచ్చాయ‌ని, తమ సంపాదనను కాపాడుకోవడానికి, వారిని ప్రశ్నిస్తున్న వారి పట్ల అసహ్యకర భాషను ఉపయోగించి ప్రత్యర్థుల ప్రతిష్టను దెబ్బతీయడానికి కొన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మీడియా సంస్థలు రావడం వల్ల జర్నలిస్టు అనే పదానికి అర్థం వెతుక్కోవలసిన దుస్థితి తలెత్తింద‌న్నారు. జర్నలిస్టు ముసుగులో రాజకీయ పార్టీల కోసం ముందుకొస్తున్న వారిపట్ల సమాజం నిశితంగా గమనించాల‌ని, అలాంటి వారు వేరన్న విషయాన్ని అసలు సిసలైన జర్నలిస్టులు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంద‌న్నారు. నిబద్ధత కలిగిన జర్నలిస్టులు ఈ వింత పోకడలపై సదస్సులు నిర్వహించి నిజమైన జర్నలిస్టులు ఎవరన్నది నిర్వచనం చెప్పాల్సిన అవసరం ఉంద‌ని, రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న ప్రకటనల పట్ల ప్రజల్లో విశ్వసనీయత తగ్గుతున్న క్రమంలో జర్నలిస్టు కూడా అదే దారిలో వేగంగా పరుగెత్తుతున్నార‌ని విమ‌ర్శించారు. నిజమైన జర్నలిస్టులకు, ఆ ముసుగులో వస్తున్న వారికి మధ్య ఒక లక్ష్మణ రేఖను గీయాల్సిన అవసరం ఉంద‌న్నారు. ఆ పని జరక్కపోతే పత్రికలకే కాదు, దేశ భద్రతకే ప్రమాదం ఏర్పడుతుంద‌ని చెప్పారు. జర్నలిస్టుల ముసుగు తొడుక్కుని విద్రోహ చర్యలకు పాల్పడిన సంగతి ఇటీవల ఆపరేషన్ సిందూర్ సందర్భంగా కొందరిని అరెస్టు చేసిన ఘటనల్లో వెలుగులోకి వచ్చాయ‌న్నారు. అబద్దాల పునాదులపైన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటే అది ఏదో ఒకరోజు కూలుతుందని విశ్వసించే వాడిని…” అని ముఖ్యమంత్రి అన్నారు. కార్యక్రమంలో సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సమాచార పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సిహెచ్ ప్రియాంక, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -