Saturday, August 30, 2025

విద్యుత్‌ సంస్కరణలకు సీఎం ఆదేశాలు

Must Read

రాష్ట్రంలో విద్యుత్‌ విభాగాన్ని ప్రక్షాళన చేయడానికి అవసరమైన కీలక సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఇంధన శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం పలు సూచనలు చేశారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఎన్పీడీసీఎల్‌, ఎస్పీడీసీఎల్‌లతో పాటు కొత్తగా మరో డిస్కమ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొత్త డిస్కమ్‌ పరిధిలో వ్యవసాయ రంగం, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్‌, పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్‌ పథకాలను చేర్చాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే యూనిట్‌గా ఈ డిస్కమ్‌ పని చేయాలని స్పష్టం చేశారు. కొత్త డిస్కమ్‌ ఏర్పాటు వల్ల ప్రస్తుత డిస్కమ్‌ల పనితీరు మెరుగుపడి, జాతీయ స్థాయిలో రేటింగ్‌ పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. విద్యుత్‌ సంస్థల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడంలో ఇది కీలకమని చెప్పారు. డిస్కమ్‌లపై ఉన్న రుణభారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, అధిక వడ్డీతో తీసుకున్న రుణాలను తక్కువ వడ్డీతో రీస్ట్రక్చర్‌ చేయాలని ఆదేశించారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో సోలార్‌ విద్యుత్‌ వినియోగాన్ని విస్తృతంగా తీసుకురావాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, జిల్లాల వారీగా కలెక్టర్లు తగిన భవనాలను గుర్తించాలని సూచించారు. రాష్ట్ర సచివాలయానికి సౌర విద్యుత్‌ సరఫరా కల్పించేందుకు ఆర్‌అండ్‌బీ శాఖతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. వేసవి కాలంలో వాహనాల పార్కింగ్‌ సమస్యను దృష్టిలో ఉంచుకుని సచివాలయంలో సోలార్‌ రూఫ్‌టాప్‌ షెడ్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక ‘ఇందిర సోలార్‌ గిరి జల వికాసం పథకం’ రాష్ట్రంలోని అన్ని గిరిజన, ఆదివాసీ తండాలు, ఏజెన్సీ ఏరియాల్లో అమలు చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే మూడు సంవత్సరాల్లో 2 లక్షల 10 వేల ఎస్టీ రైతులకు ఈ పథకం వర్తింపజేసి, 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్‌ పంపు సెట్లు అందించాలని లక్ష్యం నిర్ధేశించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -