సుప్రీం కోర్టు నేడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కీలక తీర్పు ఇవ్వనుంది. బీఆర్ఎస్ తరఫున, తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్ దాఖలైంది. వీరిలో దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్‌పై సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేసిన విషయం కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువైపులా వాదనలు పూర్తికాగా, తీర్పును గురువారం వెల్లడించనున్నట్లు చీఫ్ జస్టిస్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పుపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.