Saturday, August 30, 2025

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగ‌రేస్తాం – మంత్రి పొన్నం

Must Read

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ స్థానికుల‌కే ఇస్తామ‌ని, నియోజ‌క‌ర్గంలో కాంగ్రెస్ జెండా ఎగ‌రేస్తామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఉద‌యం జూబ్లీహిల్స్ లోని ఇందిరాన‌గ‌ర్‌లో పొన్నం ప్ర‌భాక‌ర్‌ మీడియాతో మాట్లాడారు. స్థానిక‌ ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. జూబ్లీహిల్స్‌ టికెట్‌ను స్థానికంగా పని చేసిన వారికి మాత్రమే ఇస్తామని పొన్నం స్పష్టం చేశారు. నాన్‌ లోకల్‌ అభ్యర్థులకు టికెట్‌ ఇచ్చే ప్రసక్తే లేద‌న్నారు. పార్టీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేసినా.. అందరూ కలిసి పనిచేస్తార‌ని తెలిపారు. అభ్యర్థి ఎంపిక కోసం సర్వే జరుగుతోందన్నారు. త‌ప్ప‌కుండా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగరవేస్తామనే ధీమా వ్యక్తం చేశారు. నియోజ‌క‌వ‌ర్గం నుంచి పలువురు నేతలు పోటీకి ఆసక్తి చూపుతున్నా, అభ్య‌ర్థిత్వంపై పార్టీయే తుది నిర్ణయం తీసుకుంటుంద‌ని చెప్పారు. జూన్ 8న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆరు నెలలలోపు ఉప ఎన్నిక జరగాల్సి ఉండటంతో, సెప్టెంబర్‌లో షెడ్యూల్‌ విడుదలై అక్టోబర్‌ చివర‌లో ఎన్నికలు జరిగే అవకాశముంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -