ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం మాచవరం గ్రామంలో ఓ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే మైనర్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికులను కలచివేస్తోంది. సమాచారం ప్రకారం, నాలుగు నెలల క్రితం ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు భయపడి నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఈ లోపు, పలుమార్లు దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని మూడు నెలలుగా పీరియడ్స్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించగా.. గర్భవతి అని తేలింది. దీంతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు రాయవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, ప్రిన్సిపాల్ జయరాజును అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.