Monday, October 20, 2025

సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట

Must Read

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి హైకోర్టు నుంచి ఊరట లభించింది. గతంలో గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై నమోదైన క్రిమినల్‌ కేసును హైకోర్టు కొట్టివేసింది. కేసులో సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో ఈ తీర్పు వెలువడింది. 2016లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న రేవంత్‌ రెడ్డిపై గోపన్నపల్లిలోని 31 ఎకరాల హౌసింగ్‌ సొసైటీ భూముల ఆక్రమణకు యత్నించారంటూ ఫిర్యాదు అందింది. ఈ కేసులో రేవంత్‌తో పాటు ఆయన సోదరుడు కొండల్‌ రెడ్డి, అనుచరులపై సొసైటీ సభ్యులను బెదిరించడం, దూషించారన్న ఆరోపణలతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. రెండు ఛార్జ్‌షీట్లు దాఖలైన అనంతరం, తనపై నమోదైన కేసు రాజకీయ ప్రతీకారమేనని పేర్కొంటూ రేవంత్‌ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు వినిన కోర్టు, సంఘటనా సమయంలో రేవంత్‌ అక్కడ లేరని, ఆయనపై ఉన్న ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. దీంతో కేసును కొట్టివేస్తున్నట్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో హౌసింగ్‌ సొసైటీ తరఫు న్యాయవాదులు మాత్రం రేవంత్‌ తన రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించారని ఆరోపించారు. అయినప్పటికీ, ఇరు పక్షాల వాదనలు, దర్యాప్తు నివేదికలను పరిశీలించిన హైకోర్టు… చట్టపరమైన ఆధారాల లోపం కారణంగా కేసును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -