ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన ఉదయం గన్నవరం నుంచి బయలుదేరి 11.45కి ఢిల్లీలో చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు హోంమంత్రి అమిత్ షాతో ఆయన మొదటి సమావేశం జరగనుంది. అనంతరం నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సరస్వత్‌తో భేటీ అవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ మెట్రో ఎండీ వికాస్ కుమార్‌తో మేట్రో ప్రాజెక్టులపై చర్చించనున్నారు. 3.30కి పీవీ నరసింహారావు సంస్మరణ సభలో పాల్గొననున్నారు. రాత్రి 7 గంటలకు ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ కానున్నారు.జూలై 16న కార్మికశాఖ మంత్రి మాండవీయతో సమావేశమవుతారు. అనంతరం జలశక్తి మంత్రి పాటిల్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి బనకచర్లపై చర్చించనున్నారు. చివరగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం అనంతరం జూలై 17న అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు.