Sunday, August 31, 2025

స్వర్ణలత భవిష్యవాణి.. సమృద్ధిగా వర్షాలు

Must Read

సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ‘రంగం’ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించి, భక్తులను ఆకట్టుకున్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే బాధ్యత తనదని స్వర్ణలత ప్రకటించారు. రాబోయే రోజుల్లో మహమ్మారి, అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయితే, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడి పంటలు సశ్యశ్యామలంగా పండుతాయని శుభవార్త తెలిపారు. “వర్షాలు తప్పక కురుస్తాయి, పొలాలు సమృద్ధిగా ఫలిస్తాయి,” అని భక్తులకు హామీ ఇచ్చారు. భక్తులను ఉద్దేశించి స్వర్ణలత మాట్లాడుతూ, “మీరు బాలబాలికలను విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. కానీ నేను వారిని కడుపులో పెట్టుకుని కాపాడుతాను. ఈ సారి మీరు అత్యంత భక్తితో పూజలు నిర్వహించారు. మీ అందరినీ సమానంగా, సంతోషంగా చూస్తాను. మీ అరికాలిలోని ముల్లును నాలుకతో తీస్తాను. కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారు, నేను అడ్డురాను,” అని భవిష్యవాణి వినిపించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -