వైసీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యకర్తలు, వైయస్ జగన్ అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో బంగారుపాళ్యంకు తరలివచ్చారు. జన సందోహాన్ని అదుపు చేయలేక పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరుపై వైయస్ జగన్ మండిపడ్డారు. పోలీసుల లాఠీ చార్జ్ లో చంద్రగిరి యువజన విభాగం కార్యదర్శి తలకు గాయమై రక్తస్రావం జరిగింది. దీంతో విషయం తెలుసుకున్న వైయస్ కారు దిగి సదరు వ్యక్తిని పరామర్శించే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసులు అడ్డుకొని ఆయనను కారు దిగకుండానే వెనక్కి పంపించారు. గాయపడ్డ తమ పార్టీ నేతను పరామర్శించనివ్వరా అంటూ పోలీసుల తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.