బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, రెగ్యులర్ హెల్త్ చెక్ అప్‌లో భాగమేనని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వైద్యులు, అధికారులతో మాట్లాడి వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.