దేశ మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ప్రముఖులు నివాళులు అర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ , తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆయన సేవలను స్మరించుకున్నారు.
పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. తొలి తెలుగు ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా ఆయన కీర్తిగడించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు. దేశానికి, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం – నారా లోకేష్
తెలంగాణ గర్వించే బిడ్డగా, అత్యుత్తమ పరిపాలనాదక్షుడిగా, భారత ప్రధానిగా దేశానికి అమూల్యమైన సేవలు అందించిన భారతరత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ నివాళి – హరీష్ రావు
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉండగా ప్రధాని బాధ్యతలు స్వీకరించి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశగతిని మార్చిన పీవీ ఎప్పటికీ స్ఫూర్తిగానే నిలుస్తారు. ఆ మహనీయుడి స్మృతికి మరొక్క మారు నివాళి అర్పిస్తున్నాను – నారా చంద్రబాబు