Tuesday, October 21, 2025

కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు

Must Read

మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి పోలీసులు షాకిచ్చారు. ఆయ‌న‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులు జారీ చేసిన‌ట్లు స‌మాచారం. కొడాలి నాని పాస్‌పోర్టును సైతం సీజ్ చేశారు. ఆయన కదలికలపై నిఘా పెట్టాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు డీజీపీకి ఇటీవల ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రిత‌మే నానిని అరెస్టు చేస్తారంటూ వార్త‌లొచ్చాయి. కానీ, ఆయ‌న అనారోగ్యంతో ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. దీనికి సంబంధించిన హైద‌రాబాద్‌లోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స సైతం పొందారు. కాగా, ప్ర‌స్తుతం లుకౌట్ నోటీసులు జారీ అయిన నేప‌థ్యంలో నానిని త్వ‌ర‌లో అరెస్టు చేస్తారంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -