ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర కాశీలో పర్యాటకులతో వెళ్తున్న హెలీకాఫ్టర్ సాంకేతిక లోపాల కారణంగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. హెలీకాఫ్టర్ పర్యాటకులతో గంగోత్రికి వెళ్తుండగా గంగ్నాని వద్ద కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలీకాఫ్టర్‌లో ఏడుగురు పర్యాటకులు ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.