మహేష్ బాబు ఖలేజా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొమరం పులి సినిమాలతో తనకు రూ.100 కోట్ల నష్టం వచ్చిందని నిర్మాత రమేష్ బాబు చెప్పారు. ఏడాది చేయాల్సిన సినిమాలు మూడేళ్లు అయ్యాయని అన్నారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఇండస్ట్రీ నుంచి ఫోన్ చేయలేదని.. కనీసం పలకరించిన పాపాన పోలేదని నిర్మాత రమేష్ బాబు పేర్కొన్నారు. 2011లో ఓ వ్యాపారవేత్తను బెదిరించిన కేసులో ఆయన అరెస్టై ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు.