రాజ్ తరుణ్-లావణ్య కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయియ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మస్తాన్ సాయి సుమారు 100 మందికి పైగా మహిళలను మోసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అభ్యంతరకర వీడియోలతో మహిళలను బ్లాక్‌మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేసినట్లు గుర్తించారు. యువతులను అసభ్యంగా దూషిస్తూ మానసిక క్షోభకు గురి చేసినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించిన వారిని కూడా బెదిరించినట్లు గుర్తించారు. మస్తాన్ సాయిని మరోసారి కస్టడీకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. మస్తాన్ సాయి బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.