బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో పర్యటనలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి. దానిపై సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఒత్తిడి చేయడంతో ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టారని హిందుస్థాన్ టైమ్స్ ఓ కథనంలో తెలిపింది. అయితే, రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయం కోచ్ గౌతమ్ గంభీర్‌ని అసంతృప్తికి గురి చేసిందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆట తీరుపైనా గంభీర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.