Saturday, July 5, 2025

టీటీడీ అధికారులపై చంద్రబాబు సీరియస్

Must Read

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన విషయంలో టీటీడీ ఈవో, జేఈవో గౌతమీపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఇది పద్ధతి కాదు, పద్ధతి ప్రకారం పని చేసేది నేర్చుకోండి. మీరు సమాధానం చెప్పండి. ఈ కేంద్రం వద్ద ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారని అధికారులను ప్రశ్నించారు. అలాగే

‘ప్రతి ఒక్కరికి చెప్తున్నా.. పద్ధతి ప్రకారం నడుచుకోండి. తమాషాలనుకోవద్దు. బాధ్యతలు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి.. ఎందుకు జరిగిందో చెప్పండి. అలాగే భక్తులను ఉంచేందుకు కొత్త ప్లేస్ ఎంపిక చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఇక్కడ నియమించిన పోలీస్ ఆఫీసర్‌కు జాగ్రత్తలు చెప్పారా? ఆ గేటు తీస్తే తొక్కిసలాట జరుగుతుందని ఎందుకు ఊహించలేదు? ఘటనా స్థలానికి అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చింది? టోకెన్లు ఆఫ్‌లైన్‌లో ఎన్ని ఇచ్చారు? ఆన్‌లైన్‌లో ఎన్ని ఇచ్చారు? గత విధానం కొనసాగించకుండా కొత్త విధానం ఎంపిక చేసుకుని ఉండాల్సింది?’ అంటూ అధికారులను చంద్రబాబు ప్రశ్నించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

ఆస్ప‌త్రిలో ఫిష్ వెంక‌ట్‌.. ఆదుకున్న ప్ర‌భాస్?

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య‌ సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావ‌డంతో ఆస్ప‌త్రి పాల‌య్యారు. కొద్ది రోజుల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -