‘ఆవకాయ’ ఈ పదం వింటేనే చాలా మందికి నోరూరుతుంది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఎర్రెర్రని ఆవకాయ పచ్చడితో తింటే అమృతమే. ప్రతి వేసవిలో తెలుగు వారి ఇళ్లలో సంవత్సరానికి సరిపడా ఆవకాయ పచ్చడి తప్పకుండా పెడుతుంటారు. 2024 సంవత్సరంలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వంటకాల్లో ఆవకాయ పచ్చడి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఈ పచ్చడి గ్లోబల్ లెవల్‌లో 4వ స్థానంలో ఉంది.