ఏపీలో బనకచర్ల ప్రాజెక్టును పూర్తి చేస్తే నదుల అనుసంధానం పూర్తవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. నీటి లభ్యతను బట్టి కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్ కు రోజుకు రెండు టీఎంసీల నీటిని తీసుకెళ్తామన్నారు. ఇది రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి జిల్లాల రిజర్వాయర్ల అనుసంధానం కూడా కంప్లీట్ అవుతుందన్నారు. తద్వారా రాష్ట్రంలో అదనపు ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. మూడు దశల్లో బనకచర్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఫస్ట్ ఫేజ్ లో పోలవరం నుంచి కృష్ణా నదికి నీళ్లు మళ్లిస్తామన్నారు. సెకండ్ ఫేజ్ లో బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మించి నీళ్లు తరలిస్తామన్నారు. దీని వల్ల నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.