Tuesday, October 21, 2025

మానవత దృక్పథం లోపించింది: అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ ఫైర్

Must Read

సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ మృతి, అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎట్టకేలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సీఎం రేవంత్ రెడ్డి టికెట్ల పెంపునకు, బెనిఫిట్ షోలకు అవకాశం కల్పించారు. ఆయన సహకారంతోనే వసూళ్లు పెరిగాయి. అల్లు అర్జున్ విషయంలో తెరవెనుక ఏం జరిగిందో తెలియదు. చట్టం అందరకీ సమానమే. పోలీసులను నేను తప్పు పట్టను. థియేటర్ స్టాఫ్ కూడా అల్లు అర్జున్ కు ముందే చెప్పాల్సింది. మహిళ చనిపోయిన తర్వాత అల్లు అర్జున్ తరఫున ఎవరో ఒకరు బాధిత కుటుంబాన్ని ముందే పరామర్శించాల్సింది. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ముందే చెప్పాల్సింది. పరామర్శించకపోవడం వల్లే జనాల్లో ఆగ్రహం పెరిగింది. ఈ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది.’ అని పేర్కొన్నారు. ‘సినిమా అంటే ఒక టీం. అందరి భాగస్వామ్యం. అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా చిత్రీకరించడం సబబు కాదు.’ అని తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -