మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. 92 ఏండ్ల వయస్సులో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. నేడు ఢిల్లీలో ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి నిగమ్ బోధ్ ఘాట్ వరకు ఈ యాత్ర కొనసాగుతోంది. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా అన్ని పార్టీల అధినాయకులకు, ప్రజాప్రతినిధులు, ప్రపంచ పెద్దలంతా నివాళి అర్పించారు. పార్టీలకు అతీతంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు.