వచ్చే నెల 11న ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు అధికారులు బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారు. ఈసారి ఏపీ బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. ప్రజలపై భారం పడకుండా రాబడి తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.