Thursday, November 21, 2024

Jr NTRకు అరుదైన గౌరవం.. టాలీవుడ్‌కు ప్రౌడ్ మూమెంట్!

Must Read

పాన్ ఇండియా స్టార్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కు అరుదైన గౌరవం దక్కింది. సినిమాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల అకాడమీ నుంచి ఎన్టీఆర్కు ఆహ్వానం లభించింది. అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్ లో చేరేందుకు తారక్ కు పిలుపు అందింది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా క్రేజ్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలసి తారక్ చేసిన ‘నాటు నాటు’ పాట ప్రపంచం మొత్తాన్ని ఊపేసింది. ఆస్కార్ అవార్డులను ప్రకటించే అకాడమీ తన యాక్టర్స్ బ్రాంచ్ లో కొత్త సభ్యులను సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇందులో తారక్ కు చోటు దక్కింది.

అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్ లో కొత్త సభ్యుల్లో ఆస్కార్ విన్నర్స్ అయిన కే హుయ్ క్వాన్, మర్షా స్టీఫనీ బ్లేక్, కెర్రీ కాండన్, రోసా సలాజర్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రకటించారు. వీళ్లందరికీ యాక్టర్స్ బ్రాంచ్ లో వెల్కమ్ చెబుతూ ఇన్ స్టాగ్రామ్ లో అకాడమీ ఒక పోస్ట్ పెట్టింది. వీళ్ల టాలెంట్, డెడికేషన్ ను మెచ్చుకుంది. ఆస్కార్ అఫీషియల్ వెబ్ సైట్ ప్రకారం.. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆహ్వానం మేరకు యాక్టర్స్ బ్రాంచ్ లో మెంబర్ షిప్ పొందుతారు. మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో చురుగ్గా ఉన్నవారికి, సిల్వర్ స్క్రీన్ మీద టాలెంట్ చాటుకున్న వాళ్లలో కొంతమందికి మాత్రమే ఈ సభ్యత్వానికి ఆహ్వానాలు పంపుతారు.

యాక్టర్స్ బ్రాంచ్ లో చోటు దక్కించుకోవాలంటే ఏదో ఒక యాక్టింగ్ కేటగిరీలో అకాడమీ అవార్డుకు నామినేట్ అయ్యుండాలి. ఈ రూల్స్ అన్నీ పరిగణనలోకి తీసుకొనే జూనియర్ ఎన్టీఆర్ ను సెలెక్ట్ చేసింది అకాడమీ. కాగా, తారక్ యాక్టర్స్ బ్రాంచ్ లో ప్లేస్ సంపాదించడంపై ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ను ప్రైడ్ ఆఫ్ ఇండియా అంటూ మెచ్చుకుంటున్నారు. తారక్ క్రేజ్ గ్లోబల్ రేంజ్ కు పెరిగిందని ఆయన అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. యాక్టర్స్ బ్రాంచ్ లో చోటు దక్కించుకోవడం ద్వారా టాలీవుడ్ ప్రతిష్టను ఎన్టీఆర్ మరింత పెంచారని ఫ్యాన్స్ అంటున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాగ్ చీఫ్ గా సంజయ్ మూర్తి

కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) సీనియర్ ఐఏఎస్ అధికారి కె. సంజయ్ మూర్తి నియామకం అయ్యారు. గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన...
- Advertisement -

More Articles Like This

- Advertisement -