Thursday, November 21, 2024

చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..!

Must Read

చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..!

వేసవికాలం అలా మొదలైందో లేదో సూర్యుడు భగభగమంటున్నాడు. రోజరోజుకీ ఎండలు మండిపోతున్నాయి. ఎండల బాధకు ప్రజలు విలవిలలాడుతున్నారు. మధ్యాహ్నం పూట బయటికి వెళ్లడం తగ్గించేశారు. ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే పొద్దున లేదా సాయంత్రం వేళల్లో ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ మధ్యాహ్నం మాత్రం బయటికి రావడం లేదు. ఇళ్లలో ఉండేవారు ఎండలకు తాళలేక కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇవి ఎంత ఖరీదనేది తెలిసిందే.

ఎండాకాలంలో ఎక్కడికైనా తీసుకెళ్లే ఫ్యాన్ ఉంటే బాగుండని అనిపిస్తోంది కదా. అలాంటి ఓ ఫ్యాన్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. దీన్ని డివైజ్ అనే సంస్థ తయారుచేసింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

  • మడతపెట్టుకోవడానికి వీలుగా ఉన్న ఈ ఫ్యాన్‌ ను ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీనికోసం ఈ ఫ్యాన్‌ లో రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది 360 డిగ్రీస్‌లో తిరగగలదు. కరెంట్ లేనప్పుడు బ్యాటరీ ద్వారా ఈ ఫ్యాన్ పనిచేస్తుంది. దీని రెక్కలు నిమిషానికి 3,800 సార్లు తిరుగుతాయి.
  • ఈ ఫ్యాన్‌లో ఉండే 1,600 ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీని యూఎస్బీ కేబుల్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి ఫుల్ గా ఛార్జ్ చేసేందుకు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది.
  • ఈ టేబుల్ ఫ్యాన్ ను మనకు నచ్చిన విధంగా మడత పెట్టుకోవచ్చు. దీన్ని ఎక్కడైనా, ఎలాగైనా వాడుకునేందుకు వీలుగా తయారుచేశారు. కిచెన్, లాండ్రీ రూమ్, లివింగ్ రూమ్, హోమ్ ఆఫీస్‌లో కూడా ఈ ఫ్యాన్ ను వినియోగించొచ్చు.
  • ఈ ఫ్యాన్ ఎత్తు 44 సెంటీమీటర్లు. దీని వెడల్పు 18 సెంటీమీటర్లు. దీన్ని గోడకు కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్‌కు ప్రత్యేక ఎల్ఈడీ లైట్ ఉంటుంది. దీంతో రాత్రిపూట బెడ్ లైట్ గానూ ఇది పనిచేస్తుంది. రాత్రిళ్లు దీంట్లోని లైట్ వేసుకుని హాయిగా నిద్రపోవచ్చు.
  • ప్లాస్టిక్‌తో రూపొందించిన ఈ ఫ్యాన్‌కు బటన్ కంట్రోల్ ఉంటుంది. ఈ ఫ్యాన్‌లో ఫైవ్ స్పీడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది 2 వాట్ వోల్టేజ్ ను కలిగి ఉంటుంది.
  • ఈ ఫ్యాన్ బరువు 842 గ్రాములు. తేలిగ్గా ఉండే ఈ ఫ్యాన్ ను పూర్తిగా మడతబెట్టి, ప్రయాణాల్లో సులువుగా వెంట పట్టుకుపోవచ్చు. బ్యాటరీతో ఈ ఫ్యాన్‌ హైస్పీడ్‌లో రెండు నుంచి రెండున్నర గంటల పాటు పనిచేస్తుంది. అదే తక్కువ స్పీడ్‌లో అయితే దాదాపు 3 గంటల దాకా పనిచేస్తుంది.
  • ఈ ఫ్యాన్ లైట్‌ను ఎక్కువ కాంతితో ఆన్ చేస్తే.. అది 6 నుంచి 8 గంటల పాటు పనిచేస్తుంది. అదే కాస్త తక్కువ కాంతితో పనిచేయిస్తే.. 8 నుంచి 10 గంటల వరకు పనిచేస్తుంది.
  • ఈ డివైజ్ కంపెనీ ఫ్యాన్ అసలు ధర రూ.1,499గా ఉంది. దీన్ని అమెజాన్‌లో 47 శాతం తగ్గింపుతో రూ.799కి విక్రయిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ ఫ్యాన్ ను చౌక ధరకే దక్కించుకోండి.
- Advertisement -
- Advertisement -
Latest News

కాగ్ చీఫ్ గా సంజయ్ మూర్తి

కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) సీనియర్ ఐఏఎస్ అధికారి కె. సంజయ్ మూర్తి నియామకం అయ్యారు. గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన...
- Advertisement -

More Articles Like This

- Advertisement -