Thursday, November 21, 2024

ఏమే పిల్లా.. పెళ్లి చేసుకోవే అంటాడు: సింగర్ కౌసల్య

Must Read

ఏమే పిల్లా.. పెళ్లి చేసుకోవే అంటాడు: సింగర్ కౌసల్య

టాలీవుడ్లో ఒకప్పుడు అద్భుతంగా రాణించిన ఫిమేల్ సింగర్స్లో కౌసల్య ఒకరు. ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలను ఆమె ఆలపించారు. చక్రి సంగీత దర్శకత్వంలో ఆమె పాడిన పాటలు చాలా పాపులర్ అయ్యాయయి. అప్పట్లో గాయనిగా ఒక వెలుగు వెలిగిన కౌసల్య.. మ్యారేజ్ లైఫ్లో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకవైపు భర్త నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూనే.. మరోవైపు తన సింగింగ్ కెరీర్‌ను అద్భుతంగా మలుచుకోగలిగారు. వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్నారు. కొడుకు కార్తికేయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భర్త పెట్టిన బాధల్ని భరించానని కౌసల్య అన్నారు.

అలా భరించడమే తాను చేసిన పెద్ద తప్పు అని చెప్పారు. అప్పటికి తన కొడుకు చాలా చిన్న పిల్లవాడని తెలిపారు. నాన్న అవసరం వాడికి ఉందని అన్నీ భరించానన్నారు. ‘నా కొడుకుకు ఇప్పుడు 18 ఏళ్లు. వాడు జీవితాన్ని ఎంజాయ్ చేయమంటాడు. నిన్ను బాగా చూసుకునేవాడు రావాలి అంటాడు. వాడు నన్ను పిల్ల అంటాడు. పెళ్లి చేసుకోవే పిల్లా అంటూ ఉంటాడు. ఒకే జీవితం మళ్లీ రాదంటాడు’ అని కౌసల్య చెప్పుకొచ్చారు. తాను మళ్లీ మ్యారేజ్ చేసుకునేందుకు రెడీగా ఉన్నానని.. అయితే అలాంటి వ్యక్తి ఇంకా తారసపడలేదని వెల్లడించారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

కాగ్ చీఫ్ గా సంజయ్ మూర్తి

కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) సీనియర్ ఐఏఎస్ అధికారి కె. సంజయ్ మూర్తి నియామకం అయ్యారు. గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన...
- Advertisement -

More Articles Like This

- Advertisement -