KCR సతీమణికి అస్వస్థత.. వెంటనే AIG ఆస్పత్రికి తరలింపు
తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో శోభను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఆమె వెంట కేసీఆర్ కూడా ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం శోభకు డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. తల్లిని చూసేందుకు కల్వకుంట్ల కవిత కూడా ఆస్పత్రికి వెళ్లారు. ఆమె ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి నేరుగా మీడియాతో మాట్లాడకుండానే బంజారాహిల్స్లోని తన ఇంటికి కవిత వెళ్లిపోవడం గమనార్హం.