టీడీపీ కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం దందా విజృంభిస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, "వైఎస్ జగన్ పాలనలో బెల్ట్ షాపులు లేవు. నిబంధనల ప్రకారం ప్రభుత్వమే మద్యం విక్రయాలు నిర్వహించింది. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నకిలీ మద్యం విజృంభిస్తోంది....
ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని అన్నారు. పోలీసులను ప్రభుత్వ పెద్దలు ఇష్టానుసారం వాడుకుంటున్నారని అన్నారు. నల్లపాడు స్టేషన్ పరిధిలో హత్య కేసులో వైసీపీ కార్యకర్తను అరెస్టు చేశారని అన్నారు. మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలో వైసీపీ...
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలిపివేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. కర్నూలు ఎయిర్‌పోర్టులో ఆయన్ను కలిసిన ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, జెడ్పీ చైర్మన్ తదితరులు ఈ విజ్ఞప్తి చేశారు. అలాగే, వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని, నంద్యాల-కల్వకుర్తి బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మాణాన్ని పరిశీలించాలని కోరారు. ప్రధాని...
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ నేతలను టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతోందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. బీసీ నాయకుడు జోగి రమేష్‌పై కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతలు లోకేశ్, మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీలు ఉన్నారని ఆయన ఆరోపించారు....
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మహిళలను అవమానించడం అలవాటుగా పెట్టుకుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. జీడీ నెల్లూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మీపై టీడీపీ ఎమ్మెల్యే థామస్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీన్ని సీఎం చంద్రబాబు పట్టించుకోలేదని ఆమె మండిపడ్డారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జనసేన మహిళా నాయకురాలిపై వీడియోలు తీయించారని,...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావాలని వచ్చిన సంస్థలను స్వాగతిస్తామని, అయితే వాటి నుంచి రాష్ట్రానికి లభించే ప్రయోజనాలపై చర్చ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం-గూగుల్ మధ్య ఇటీవల జరిగిన మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ పై స్పందిస్తూ...
ఆంధ్రప్రదేశ్‌లో బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాల సాధికార అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ, బీసీ విభాగం...
వైసీపీ సీనియర్ నేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గురువారం సాయంత్రం 5 గంటల లోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ కానున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వినియోగించేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు ఐదు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ గడువు ముగియడంతో మిథున్ రెడ్డి హైదరాబాద్ నుంచి రాజమండ్రి...
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతలు, వైసీపీ నేతల మధ్య మాటల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.మాచవరంలో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, గతంలో కర్ర పట్టుకుని వచ్చినవారు రేపు గొడ్డలితో వస్తారన్నారు. టీడీపీ...
వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గణపతికి తొలి పూజలో పాల్గొని ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. జగన్ షెడ్యూల్ ప్రకారం ఉదయం విజయవాడ రాణిగారితోటలోని వినాయక మండపంలో పూజలకు హాజరయ్యేలా ప్రణాళిక వేసినా, కురిసిన...